telugu navyamedia
Uncategorized

నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ను ప్రారంభించిన మోదీ

modi delhi

నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌(ఎన్‌డీహెచ్‌ఎం)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం మోదీ మీడియాతో మాట్లాడారు. పూర్తిగా టెక్నాలజీ ఆధారితమైన ఈ మిషన్‌ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దోహదం చేస్తుందని తెలిపారు. దీని కింద ప్రతి పౌరుడికి ఒక ఐడీ నంబర్‌ను కేటాయించనున్నారు. ఈ పథకంలో ప్రజలు తమ ఆరోగ్య డేటాను ‘ఈ-రికార్డులు’గా అప్‌ లోడ్‌ చేసుకోవచ్చు. దీని వల్ల ప్రజల ఆరోగ్య చికిత్సలకు సంబంధించిన డేటా నిక్షిప్తం అవుతుందన్నారు.

భవిష్యత్‌లో వారు మరో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరితే ఆ సమయంలో ఈ డేటాను వైద్యులు, ఆసుపత్రులు వినియోగించుకునే అవకాశాలు ఉంటాయి. ప్రజలు ఎలాంటి ప్రిస్ర్కిప్షన్‌ లేకుండా ఆసుపత్రికి వెళ్లినా, వారి ఆరోగ్య గుర్తింపు సంఖ్య ఆధారంగా డాక్టర్లు హెల్త్‌ రికార్డులను పరిశీలించి గతంలో రోగికి అందిన వైద్యం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీని వల్ల గత రికార్డుల ఆధారంగానూ రోగికి మెరుగైన వైద్యం అందుతుంది. ఆసుపత్రి లేక ఫార్మసీకి వెళ్లిన ప్రతిసారి జాతీయ స్థాయిలో ఆ సమాచారం మొత్తం కార్డులో నిక్షిప్తమవుతుందని తెలిపారు.

Related posts