BREAKING NEWS:

అమెరికాతో నారాయణ రెడ్డి అనుబంధం అందుకే ..!

83

డాక్టర్ సి. నారాయణ మరణించి అప్పుడే సంవత్సరం అవుతుంది . తెలుగు సాహిత్యంలోనూ, సినిమా పాత రచనలోనూ తనదైన ముద్ర వేసిన మహాకవి నారాయణ రెడ్డి . తెలంగాణలోని కరీంనగర్ హనుమాజీపేట లో జులై 29 ,1931లో జన్మించారు . చిన్నప్పుడే నాగలి దున్నుతూ పద్యాలు చెప్పడం , ఆశు కవిత్వం అలవాటు అయ్యింది .
ఉస్మానియాలో ఎమ్మె చదివే రోజుల్లోనే నారాయణ రెడ్డి కవిగా తన గళం విప్పాడు, తన ప్రతిభ చాటారు ..

అనంతరం ,నాగార్జున సాగరం, విశ్వనాథ నాయడు,విశ్వంభర, మనిషి – చిలక,ముఖాముఖి,భూగోళమంత మనిషి,దృక్పథం, కలం సాక్షిగా, కలిసి నడిచే కలం, రెక్కల సంతకాలు మొదలైన కావ్యాలు ఆయనకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టాయి . 1962లో మహానటుడు ఎన్టీరామారావు నారాయణ రెడ్డిలోని ప్రతిభను గుర్తించి “గులేబకావలి కథ” చిత్రంతో సినిమా రంగానికి పరిచయం చేశాడు .

1988లో ఆయన రాసిన విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు లభించింది . పద్మశ్రీ , పద్మభూషణ్ మొదలుకొని ఎన్నో అవార్డులు ఆయన్ని వరించాయి . గత సంవత్సరం జూన్ 12న ఇహలోక యాత్ర ముగించారు .
మహాకవి డాక్టర్ సి నారాయణరెడ్డి మరణించి ఒక ఏడాది అవుతున్న సందర్భంగా అమెరికాలోని చికాగోనగరం లో జూన్ ఎనిమిదవ తేదీ సాయంత్రం ‘బెథానీ అఫ్ ఫాక్స్ వాలీ యునైటెడ్ మెథడిస్ట్ చర్చ్ లో ఆయన స్మృతికి నివాళి అర్పించారు .
సేవామహత్మ వంశీ రామరాజు ఆధ్వర్యంలో జరిగిన సద్గురు ఘంటసాల ఆరాధనోత్సవాలు మరియు బాలు సంగీతోత్సవాలలో నారాయణ రెడ్డి రాసిన గీతాలు గీతాంజలి, బాల కామేశ్వర రావు ఆలపించారు .

నారాయణ రెడ్డి గారు మొదట గుళేభాకావాలి కథ చిత్రంలో రాసిన “నన్ను దోసుకుందువటే ..” పాటతో కార్యక్రమం ప్రారంభమైంది .
ఈసందర్భంగా ఎడవల్లి రమణమూర్తి,r,డాక్టర్ శొంఠి శ్రీరామ్,శొంఠి శారద,పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్వీ రామారావు,,వాణి దిట్టకవి ప్రసంగిస్తూ డాక్టర్ సినారాయణ రెడ్డి గారికి చికాగో తో విడతీయరాని సంబంధం వున్నదని అన్నారు. బాషా రుచిని ప్రవాస తెలుగు వారికీ పంచిన మహాకవి అని సినారె సభకు వస్తున్నారని తెలిస్తే జనం తండోపతండలుగా వచ్చి వారి ఉపన్యాసాలు వినేవారని అన్నారు.

డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పద్మశ్రీ అవార్డు కమిటి లో ఉన్నప్పుడు తనకు పద్మశ్రీ వచ్చిందని డాక్టర్ స్ వి రామారావు గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు ప్రసంగిస్తూ తమకు డాక్టర్ సినారె కు ఉన్న 45 సంవత్సరాల అనుబంధాన్ని తెలియచేస్తూ వేగేశ్న ఆశ్రమం లో 45 లక్షలతో ఎంపీ నిధులనుంచి బిల్డింగ్ నిర్మాణం కోసం ఇచ్చారని తెలిపారు .
ఈకార్యక్రమంలో రాజకమల్ చారిటీస్ జయ్ రామ్ ఎర్రమిల్లి కూడా పాల్గొన్నారు.ఈకార్యక్రమాన్ని శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ అఫ్ నార్త్ అమెరికా,చికాగో ఆంధ్ర అసోసియేషన్, అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించాయి. వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా మరియు తెలంగాణ టూరిజమ్ సహకరించాయని రామ రాజు తెలిపారు .