telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

నందమూరి తారక రామారావు గారి 29వ వర్థంతి సందర్భంగా నారా లోకేష్ నివాళులు

“యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నాను.

ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు.. ప్రభంజనం. అదొక సంచలనం. తెలుగువాడి విశ్వరూపం. వెండితెరపై రారాజుగా వెలుగొందారు, రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారు.

తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజాసంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైంది. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లని నినదించారు.

కోట్లాది హృదయాల్లో కొలువైన మా తాతగారే నాకు నిత్యస్ఫూర్తి. ఆయన వర్థంతి సందర్భంగా ఇవే నా ఘన నివాళులు”  నారా లోకేష్.

Related posts