jagan and nara lokesh

నువ్వు దోచుకోకుండా మిగిల్చింది ఏమైనా ఉందా ?- నారా లోకేష్

22

ట్విట్టర్ లో ప్రతిపక్ష నాయకుడు జగన్ కు కౌంటర్ ఇచ్చాడు మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో సహజ వనరులను దోపిడీ చేస్తున్నారని, ఆ దోచుకున్న సొమ్ము దాచుకుంటున్నారని అంటూ జగన్ తన పాదయాత్ర సందర్భంగా నిన్న ఈ ఆరోపణలు చేశారు.

దీనిపై ఈ రోజు ట్విట్టర్ లో రాష్ట్ర పంచాయతి రాజ్, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. సహజ వనరులను దోచుకోవడం అనేది జగన్ మాట్లాడం హాస్యాస్పదంగా వుందని చెప్పి వ్యాఖ్యనించడంతో పాటు ఈ రాష్ట్రంలో నువ్వు దోచుకోకుండా మిగిల్చింది ఏమైనా ఉందా ? అని ప్రశ్నించారు. జగన్ బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కింద సహజ ఖనిజాలు, పార్క్ సైట్, లైం స్టోన్ తినేశారని పేర్కొన్నారు. దీనితోపాటు నీ మీద వున్న13 ఛార్జ్ షీట్ లో నువ్వు దోచుకున్న ఖనిజాలు ఏమిటి? లైమ్ స్టోన్ ఎమిటీ ? ఇతర సహజ వనరులు ఏమిటి ? అనేది మెనూ కింద వుంది… మొత్తం ఒకసారి చూసుకోవాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

ఈ ట్వీట్లతో వైఎస్సార్సీపీ నేతలను డిఫెన్స్ లో పడేశామని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. ఎక్కడెక్కడ ఎంత దోచుకున్నాడనేది 13 ఛార్జ్ షీట్ లో మెనూ వుందని, కర్ణాటకలో మీ ఫ్రెండ్ గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన అంశాలను కూడా నారా లోకేష్ ప్రస్తావించాలని భావించారు అని తెలుగుదేశం నాయకులు తెలిపారు.

తెలుగు దేశం పార్టీ నేతలు ఈ రోజు సాయంత్రంలోపు దీనిపై మీడియాతో మాట్లాడబోతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నివాసంలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుంది. జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఈ ట్వీట్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్నాయి.