మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్మరించుకున్నారు.
ఆ మహానీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నానని చెప్పారు. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన కోసం పూలే అలుపెరుగని పోరాటం చేశారని తెలిపారు.
పూలే త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను నారా లోకేష్ గుర్తుచేసుకున్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని అన్నారు.
స్త్రీ విద్య కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని ఉద్ఘాటించారు.
సమసమాజ నిర్మాణంలో జ్యోతిరావు పూలే కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు.
మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అభివర్ణించారు.
పూలే ఆశయ సాధనకు కృషి చేయడమే మనం అర్పించే ఘన నివాళి అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.