telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో అంబేద్క‌ర్ రాసిన‌ రాజ్యంగం అమ‌లు కావడం లేద‌ని.. రాజారెడ్డి రాజ్యాంగం అమ‌లు

*కోర్టుకు హాజరైన‌ నారా లోకేష్..
*నేను ఏ త‌ప్పు చేయ‌లేదు కాబ‌ట్టి జ‌డ్జి ముందు నిల‌బ‌డ్డా..
*ప్ర‌భుత్వంతో పోరాటంలో త‌గ్గేదేలేదు..త‌గ్గ‌డం మా బ్ల‌డ్‌లోనే లేదు..
*నాపై ఆరోప‌ణ‌ల‌పై చ‌ర్చ‌కు సిద్ధం..
*వైసీపీ నేత‌లలు నేరాలు చేసిన నో పోలీస్‌..నో కేస్‌
*టీడీపీ నేత‌ల‌పై మాత్రం అక్ర‌మ కేసులు పెట్టి పోలీస్ స్టేష‌న్ల చుట్టూ తిప్పుతారు..

*శుభాకార్యాల‌కు హాజ‌ర‌వుతున్నా పోలీసుల‌కు క‌నిపించ‌లేదా?

ఏపీలో అంబేద్క‌ర్ రాసిన‌ రాజ్యంగం అమ‌లు కావడం లేద‌ని.. రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరయ్యారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో నారా లోకేష్ ఏసీబీ కోర్టు వద్దకు వచ్చారు.

ఆ సమయంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.లోకేష్‌తో పాటు కొల్లు రవీంద్ర కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు కోర్టు వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ భారీగా పోలీసులు మోహరించారు

ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ..55 మంది టీడీపీ నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్టార‌ని, ఒక్క కేసు కూడా నిరూపించ‌లేక‌పోయార‌ని లోకేష్ అన్నారు.

2016 నుంచి తన‌పై చేసిన అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమని… తన అవినీతి కేసులపై చర్చకు జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇప్పుడు కోవిడ్ కేసు పెట్టింది.

నేను ఏ త‌ప్పు చేయ‌లేదు కాబట్టే జ‌డ్జి ముందు నిల‌బ‌డ్డాన‌ని అన్నారు. నాపై ఎన్ని కేసులు పెట్టినా ప్ర‌భుత్వంతో పోరాటంలో త‌గ్గేదేలేద‌ని నారా లోకేష్ వెల్ల‌డించారు.

ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడితే దాడులా చేస్తారా అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు? టీడీపీ నేత‌ల‌తో పాటు దళిత ప్రజలపై వైసీపీ దాడులకు తెగపడుతోందన్నారు. సొంత కార్యకర్త అయిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యే ఇందుకు ఉదాహరణ అని అన్నారు.

ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని లోకేష్ డిమాండ్ చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. సుబ్రహ్మణ్యం హత్యకు గురై 72 గంటలైనా నిందితులను పట్టుకోలేరా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి 24 గంటల సమయం ఇస్తున్నామని అన్నారు.

24 గంట్లో అనంతబాబును పట్టుకోకపోతే ఉద్యమిస్తామని చెప్పారు. సుబ్రహ్మణ్యం హత్య తర్వాత ఎమ్మెల్సీ అన్ని చోట్లకు వెళ్లారని లోకేష్ చెప్పారు. అనంతబాబు.. ప్రభుత్వ సలహాదారు సజ్జలను కూడా కలిశారని అన్నారు. పోలీసులకు మాత్రం అనంతబాబు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. 

 

 

Related posts