telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

చంద్రబాబు పుట్టినరోజున.. నారా బ్రహ్మణి రక్తదానం!

Nara brhmani blood donate CM birthday

నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన 69వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు తన పుట్టినరోజును కుటుంబ సభ్యులు, పార్టీ నేతలతో కలిసి ఈరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత జగన్, నారా లోకేశ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బాడ్మింటన్ క్రీడాకారుడు కిడింబి శ్రీకాంత్ సహా పలువురు ప్రముఖులు చంద్రబాబుకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా చంద్రబాబు పుట్టినరోజు నేపథ్యంలో ఆయన కోడలు నారా బ్రహ్మణి ఈరోజు రక్తదానం చేశారు. ఎన్టీఆర్ ట్రస్టులో రక్తదానం చేసిన అనంతరం ఆ ఫొటోను ఆమె ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ‘రక్తదానం చేయండి.. ప్రాణాలను కాపాడండి’ అని బ్రహ్మణి పిలుపునిచ్చారు.

Related posts