అసెంబ్లీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల కామెంట్లకు పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. చిత్తూరు జిల్లాలో పర్యటించిన భువనేశ్వరి.. వరద ప్రమాద మృతులకు ట్రస్ట్ తరఫున ఆర్థికసాయం అందజేశారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ఇచ్చారు. దేశంలో ఏ ఆపద వచ్చినా.. ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుంటుందని చెప్పారు.
ఈ సందర్భంగా వైసీపీ నేతల వ్యాఖ్యలపై భువనేశ్వరి స్ర్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేశానికి ఉపయోగం లేని విమర్శలెందుకు? అని ప్రశ్నించారు. రాత్రింబవళ్లు నిద్ర లేకుండా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తుచేసుకున్నారు. నా భర్త పనితీరు ఏంటో ప్రజలకు తెలుసు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలను పట్టించుకోం.. బాధపడమని.. ప్రజాసేవకే అంకితమవుతామని వెల్లడించారు నారా భువనేశ్వరి.
అసెంబ్లీలో తనపై జరిగిన సంఘటనలపై ప్రశ్నించగా రాజకీయాలు నేను మాట్లాడను..వాళ్ల పాపాన వాళ్లే పోతారని వ్యాఖ్యానించారు. వాళ్లు వచ్చి సారీ చెబుతారని తానేమీ ఎదురు చూడటం లేదన్నారు భువనేశ్వరి. ఆ విషయాల గురించి ఆలోచించి టైమ్ వేస్ట్ చేయడం తనకు ఇష్టం లేదన్నారు.
ఎవరైనా సరే మహిళల్ని గౌరవించాలని, నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. అన్నీ పరిస్థితుల్లోనూ కుటుంబ సభ్యులు ఎప్పుడూ తనకు మద్దతుగా నిలడ్డారని చెప్పారు. హెరిటేజ్‌ను కూలగొట్టడానికి చాలామంది ట్రై చేశారని.. సంస్థ కార్యకలాపాలు చాలా ట్రాన్స్పరెంట్‌గా ఉంటాయని.. ఎవరూ టచ్ చేయలేరని స్పష్టం చేశారు.
అమరావతిని అభివృద్ధి చేయాలని ఆకాంక్షించా: చంద్రబాబు