నాని, విక్రమ్.కె.కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం “గ్యాంగ్ లీడర్”. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్నారు. ఇందులో ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఐదుగురు మహిళలకు నాని లీడర్‌గా, స్టోరీ రైటర్‌గా కనిపించబోతున్నాడు. ఇది ఒక రివేంజ్ డ్రామా అని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. మరోసారి విక్రమ్ కే కుమార్ తన మార్క్ స్క్రీన్ ప్లేతో సిద్ధమైపోయాడు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. దానికి తగ్గట్లే సినిమా బిజినెస్ కూడా జరుగుతోంది. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్తొకటి సోషల్ మీడియా హల్ చల్ చేస్తుంది. అదేంటంటే ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేశారట. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అన్నింటిలో ఓ పాత్రను మాత్రమే రివీల్ చేశారు. మరో పాత్ర మాత్రం సినిమాలోనే కనపడతుందట. ఇప్పటి వరకు “జెండాపై కపిరాజు”, “జెంటిల్‌మన్”, “కృష్ణార్జునయుద్ధం” చిత్రాల్లో నాని ద్విపాత్రాభినయం చేశారు. మరిప్పుడు నాని ద్విపాత్రాభినయంపై వినపడుతో్న్న వార్తల్లో నిజా నిజాలు తెలియాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే.
previous post