telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాని గ్యాంగ్ లీడర్ .. ప్రీ లుక్ .. గ్యాంగ్ హ్యాండ్ ఇచ్చింది..

nani movie gang leader pre look

నాని ప్ర‌స్తుతం విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో గ్యాంగ్ లీడ‌ర్ చిత్రం చేస్తున్నాడు. నాని 24వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని ఆగ‌స్ట్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు. ఈ చిత్రంలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ ప్ర‌తినాయ‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ప్రియాంక అరుల్‌మోహ‌న్, ల‌క్ష్మీ , శ‌ర‌ణ్య‌, అనీష్ కురువిళ్ళా, ప్రియ‌ద‌ర్శి, ర‌ఘుబాబు, వెన్నెల కిషోర్, జైజా, స‌త్య త‌దిద‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఈ చిత్రంలో అయిదుగురు అమ్మాయిలు దొంగ‌లుగా ఉంటారని వారికి నాయ‌కుడిగా నాని ఉంటారనే టాక్ న‌డుస్తుంది. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కొద్ది సేప‌టి క్రితం చిత్ర ప్రీ లుక్ విడుద‌ల చేశారు మేక‌ర్స్ . ఇందులో నాని చేతిలో చేయి వేసి ఐదుగురు అమ్మాయిలు ప్ర‌మాణం చేస్తున్న‌ట్టుగా ఉంది. ఈ ప్రీ లుక్‌తో చిత్రానికి సంబంధించి మిగ‌తా వివ‌రాలు కూడా వెల్ల‌డించారు. ఫ‌స్ట్ లుక్ జూలై 15,ఫ‌స్ట్ సాంగ్ జూలై 18, టీజ‌ర్ జూలై 24న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు . ఈ సినిమా ప‌క్కా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని అందిస్తుంద‌ని టీం చెబుతుంది.

Related posts