నాగవైష్ణవి కేసులో ముగ్గురికి యావజ్జివ శిక్ష

49

నాగవైష్ణవి హత్య కేసులో కోర్టు తీర్పునిచ్చింది, ముగ్గురు దోషులు పంది వెంకట్రావు, మోర్ల శ్రీనివాస్, వెంపరాల జగదీష్ లకు యావజ్జివ కారాగార శిక్ష విధించిన విజయవాడ మహిళా సెషన్స్ కోర్ట్. అతి నీచమైన, హేయమైన చర్య గా అభివర్ణించిన న్యాయమూర్తి, హత్య, కిడ్నాప్ ల క్రింద నేరం రుజువైనట్టు వెల్లడించారు. ఎనిమిదిన్నర సంవత్సరాల తర్వాత ఈ తీర్పు వెల్లదించడం జరిగింది.

ఇటువంటి కేసులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. నాగవైష్ణవి తల్లి తండ్రి ఇద్దరు మరణించారు. నాగవైష్ణవి హత్య ఫై వచ్చిన తీర్పు పట్ల ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇంకా కఠినమైన చట్టాలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.