telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సీనియర్‌ నటితో నాగశౌర్య..ఫోటో వైరల్‌

ఊహలుగుసగుస లాడే అంటూ అందరిని ఊహల్లో తేల్చేసిన హీరో నాగశౌర్య. తన మొదటి సినిమాతోనే పక్కింటి అబ్బాయిలా కనిపించి అందరి ఆదరణను పొందాడు. ఆ తరువాత చలో అని అందరిని థియేటర్ల బాట పట్టించాడు.  ‘లక్ష్య’, ‘వరుడు కావాలి’ చిత్రాలను దాదాపు పూర్తి చేసిన నాగశౌర్య ప్రస్తుతం సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఫిలిమ్ సిటీలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి అనీస్ కృష్ణ దర్శకుడు. దీని ద్వారా మోడల్ షిర్లీ సిటియా తెలుగులో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. రాధికా శరత్ కుమార్ కీలకమైన ఫుల్ లెంగ్త్ పాత్రలో కనిపించనున్నారు. ఏడవతేదీతో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆన్ లొకేషన్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నాగశౌర్య, రాధిక ఇద్దరూ బ్రాహ్మణుల గెటప్ లో కనిపిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా రాధికా శరత్ కుమార్‌ ట్వీట్ చేస్తూ ‘నాగశౌర్య వంటి టాలెంట్ ఉన్న హీరోతో కలసి నటించటం ఆనందంగా ఉంది.
తను సెట్స్ లో ఎంతో ఫన్ గా ఉంటాడు’ అన్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి ఉషాముల్పూరి, శంకర్ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Related posts