telugu navyamedia
సినిమా వార్తలు

‘ఘోస్ట్’గా మారిన‌ మన్మధుడు..

టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జున “ఘోస్ట్”గా మారాడు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా నాగార్జున తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా భా1రీ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

యాక్షన్ థ్రిల్లర్ మేకర్స్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సినిమాకి “’ది ఘోస్ట్’ అనే టైటిల్‌తో పాటు మూవీలోని ఆయన ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఫస్ట్ లుక్ లో నాగ్ కత్తి పట్టుకుని శత్రువులను వేటాడే పనిలో ఉన్నాడు. కొంతమంది విలన్లు ఆయన ముందు మోకరిల్లి కన్పిస్తున్నారు. ఈ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న విదేశీ బ్యాడ్డీలు, లండన్ ల్యాండ్‌స్కేప్ పిక్ చూస్తుంటే సినిమా అంతర్జాతీయ కథాంశంతో రూపొందబోతున్నట్లు అన్పిస్తోంది.

ప్రీ లుక్ తో ఆసక్తిని రేకెత్తించిన నాగ్ ఫస్ట్ లుక్ తో ఆయన అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారు. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

ఆల్ టైం హ్యాండ్సమ్ హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు ఈరోజు కావున టాలీవుడ్ వర్గాలు తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ స్పెషల్ డే ను అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు.

Related posts