telugu navyamedia
సినిమా వార్తలు

సంక్రాంతి రేసులో ‘బంగార్రాజు’ – వీడ‌ని సస్పెన్స్..

అక్కినేని నాగార్జున, నాగచైతన్య క‌లిసి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బంగార్రాజు’. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి ప్రీక్వెల్​గా వ‌స్తున్న సినిమా ఇది. ఇందులో నాగార్జునకు జ‌త‌గా రమ్యకృష్ణ, చైత‌న్య‌కు జ‌త‌గా కృతిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

High Dose Of Glamour For Bangarraju

ఈ సినిమా సంక్రాతికి స్పెషల్​గా వచ్చే ఏడాది జనవరి 15న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా విడుదలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

ఇప్పటికే సంక్రాంతి బరిలో ఉన్న‌ ‘ఆర్​ఆర్​ఆర్​’, ‘రాధేశ్యామ్​’ వంటి బడా సినిమాలు ఉండటం వల్ల మిగతా సినిమాలు రేసు నుంచి తప్పుకొంటున్నాయి. ఇప్పటికే సూపర్​స్టార్​ మహేశ్​ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’, పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​-రానా కీలక పాత్రలు పోషించిన ‘భీమ్లా నాయక్’​ చిత్రాలు బరి నుంచి వైదొలిగాయి. ఈ నేపథ్యంలో అందరి చూపు ‘బంగార్రాజు’ మీద పడింది..

When will Nagarjuna announce Bangarraju date? - English OKTelugu

అయితే దీని పై ప్రకటన కోసం నిర్మాతలు, మిగతా సినిమాలు ఎదురు చూస్తున్నాయి. మరి దీని పై నాగ్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరి ‘బంగార్రాజు’ సంక్రాంతి రేసులో ఉంటుందో లేక తప్పుకొంటుందో తెలియాలంటే చిత్రబృందం అధికారిక ప్రకటన ఇచ్చేవరకు ఆగాల్సిందే.

Related posts