telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జూన్ 4 తరువాత కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న నాగబాబు

పవన్ కళ్యాణ్ వ్యూహం, చంద్రబాబు అనుభవం, బీజేపీ పెద్దల మద్దతు ఫలించాయని నాగబాబు వెల్లడించారు.

ఈసారి ఎన్నికల్లో తాము పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లకు 21 సీట్లనూ గెలువబోతున్నట్లు జనసేన నేత నాగబాబు వెల్లడించారు.

ఎన్నికల సందర్భంగా ఎదురైన సవాళ్లు, ఏ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ఎలా నడిచిందనే అంశాలపై అభ్యర్ధులతో నిర్వహించిన వర్చువల్ భేటీలో ఆయన చర్చించారు. ఇందులో జనసేన అభ్యర్ధులంతా వారి అనుభవాలను పంచుకున్నారు.

ఎవరి నియోజకవర్గాల్లో వారు పరిస్థితులను బట్టి ఇబ్బందులు ఎదుర్కొని అన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్లారని నాగబాబు ప్రశంసించారు.

ఈ ఎన్నికల్లో పరిస్థితులు వైసీపీకి ఏ మాత్రం అనుకూలంగా లేవన్నారు. ప్రతి చోటా జనసైనికులు ముందుండి ఎన్నికల ప్రక్రియను అద్భుతంగా నడిపించారన్నారు.

ఈ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాలతోపాటుగా గ్రామీణ ప్రాంత ప్రజలు జనసేనకి అండగా నిలిచారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. పోటీ చేసిన ప్రాంతాల్లో జనసేనకు, ఇతర నియోజకవర్గాల్లో కూటమికి బలంగా నిలబడ్డారన్నారు

Related posts