telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగచైతన్యకు జోడిగా రష్మిక ?

Rashmika

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య తన తదుపరి సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ సినిమా రూపుదిద్దుకొంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు ‘థాంక్యూ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అక్కినేని సమంత నటించనుందని వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదని అంటున్నారు. ఈ మూవీ లో హీరోయిన్ గా లక్కీ బ్యూటీ రష్మిక మందన్న పేరును చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ ఏడాది ‘భీష్మ’ ‘సరిలేరు నీకెవ్వరు’తో మంచి విజయాలను అందుకున్న రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమా లో నటిస్తోంది.

Related posts