telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ లో .. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ..

NAC free training for unemployed

నిరుద్యోగ యువతకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(న్యాక్) లో నైపుణ్య శిక్షణను అందించేందుకు పలు కోర్సులను ప్రవేశపెట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. న్యాక్-పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (ఎంఈపీఎంఏ)వారి సంయుక్త ఆధ్వర్యంలో పలు కోర్సులలో నైపుణ్య శిక్షణ పొందేందుకు నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇందులో 5వ తరగతి నుండి ఇంటర్, ఐటీఐ పూర్తిచేసిన యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 10వ తరగతి విద్యార్హతతో పాటు స్టడీ సర్టిఫికెట్లు, 5 పాస్‌ఫోర్టు సైజ్ ఫొటోలు, ఆధార్, రేషన్‌కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్‌ను తీసుకురావాలని నిర్వాహకులు తెలిపారు. 798905 0888, 8328622455 సంప్రదించండి.

Related posts