sudheer-babu-and-ram-gopal-

కళ్యాణ్ రామ్ కు పోటీగా సుధీర్ బాబు…!?

12

నంద‌మూరి కళ్యాణ్ రామ్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ `నా నువ్వే`. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ మహేశ్ కోనేరు స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో.. జ‌యేంద్ర దర్శ‌క‌త్వంలో కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్ వ‌ట్టికూటి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందింది. జూన్ 14న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్, మిల్కి బ్యూటీ తమన్నా మధ్య రొమాంటిక్ సీన్లు అదిరిపోయాయి. తొలిసారిగా కళ్యాణ్ రామ్ ఇలాంటి లవ్ జోనర్ లో సినిమా చేస్తున్నాడు. ఇటీవల తాను నటించిన సినిమాలు ,మంచి విజయం సాధించడంతో మంచి ఫామ్ లో ఉన్నాడు కళ్యాణ్ రామ్. ఇక తమన్నా కూడా వెండితెరపై ఇంత గ్లామర్ గా ఎప్పుడూ కన్పించలేదనే చెప్పవచ్చు. తమన్నా చివరిగా బాహుబలి చిత్రంలో కన్పించింది. ఆ తరువాత ఇప్పటివరకు మరే తమన్నాకు ఎలాంటి ఛాన్సులు రాలేదనే చెప్పవచ్చు. మరి ఈ చిత్రం విజయం చాలా అవసరం. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నింటినీ ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదల గురించి యూత్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది.

శ్రీదేవి మూవీస్ పతాకంపై ‘సమ్మోహనం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు, అదితిరావ్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి చిత్ర రంగంలో జాతీయ పురస్కారాన్ని అందుకున్న మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని క్లీన్ యు సర్టిఫికెట్ ను పొందింది. ఈ చిత్రం జూన్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ చిత్రంలో సుధీర్ బాబు, అదితి రావు జంట బాగుంది. అదితిరావు బాలీవుడ్ హీరోయిన్. ఆమెకిది తెలుగులో మొదటి చిత్రం కావడం విశేషం. అయితే ఈ చిత్రంలోని ఆమె పాత్రకు తెలుగులో తానే డబ్బింగ్ కూడా చెప్పింది. అంతేకాదు సినిమాకు అదితిరావు గ్లామర్ ప్రత్యేకమైంది. సుధీర్ బాబుకు ప్రేమకథా చిత్రం భారీ విజయం తరువాత మళ్ళీ అలాంటి హిట్ తన ఖాతాలో పడలేదనే చెప్పవచ్చు. ఆ తరువాత చేసిన సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి. “శమంతకమణి” చిత్రం మంచి విజయాన్నే సాధించినా… అది మల్టీస్టారర్ కాబట్టి అంతగా చెప్పుకోదగ్గ విషయం కాదు. ఇటీవల హిందీ చిత్రం “భాగీ”లో విలన్ గా మెరిశాడు. ఇప్పుడు “సమ్మోహనం”లో బాలీవుడ్ భామ అదితితో జతకడుతున్నాడు. ఈ చిత్రం ట్రైలర్ ను సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇక ప్రీ రిలీజ్ వేడుకకు మహేష్ బాబు ముఖ్య అతిథిగా వచ్చారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సుధీర్ బాబు భారీగానే ఆశలు పెట్టుకున్నాడని చెప్పవచ్చు.

కాగా జూన్ 14న “నా నువ్వే” ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. మరుసటి రోజే థియేటర్లలోకి “సమ్మోహనం” రాబోతోంది. ఈ రెండు చిత్రాలూ రొమాంటిక్ జోనర్లోనే తెరకెక్కుతున్నాయి. మరి ప్రేక్షకులంతో ఆసక్తిగా, ఆతృతగా ఈ చిత్రాల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లోని పాటలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. ఒకరోజు తేడాతో సినీ ప్రియుల ముందుకు వస్తున్న ఈ సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే. మరి బాక్స్ ఆఫీస్ బరిలో నెగ్గేదెవరో తెలియాలంటే ఈ సినిమాల విడుదల వరకు ఆగాల్సిందే…!?