naa nuvve

“నా నువ్వే” మా వ్యూ

23

బ్యానర్ : గ్లోబల్ బ్రీజ్ సినిమాస్
నటీనటులు : నందమూరి కళ్యాణ్ రామ్, తమన్నా
దర్శకుడు : జయేంద్ర పంచపాకేషన్
సంగీత దర్శకుడు : షేరేత్
నిర్మాతలు : కిరణ్ ముప్పవరపు, విజయ కుమార్ వట్టికూటి
కొరియోగ్రాఫర్ : పిసి శ్రీరామ్

కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో మొట్టమొదటి సారిగా పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటించారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది. ఈ చిత్రంపై సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. అంతేకాకుండా టీజర్, ట్రైలర్ చూసిన సినీ ప్రియులు ఒక ఫ్రెష్ లవ్ స్టోరీని ఆశిస్తారు పాజిటివ్ బజ్ తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు అలరించిందా ? అనేది తెలుసుకుందాం.

కథ
ఎఫ్ఎం రేడియోలో ఆర్.జేగా పని చేస్తుంది మీరా (తమన్నా). అయితే వాలంటైన్స్ డే కోసం స్పెషల్ ప్రోగ్రామ్ మ్యాజిక్ 100 అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ సందర్భముగా మీరా తన లవ్ స్టోరీ గురించి చెబుతుంది. మీరా (తమన్నా), వరుణ్ (కళ్యాణ్ రామ్) ఫ్లాష్ బ్యాక్ కథ మొదలవుతుంది. వరుణ్ ఫొటోగ్రాఫ్ బుక్ ఒకటి మీరాకు చేరుతుంది. అప్పట్నుంచి తమన్నా లైఫ్ లో అన్నీ పాజిటివ్ గానే జరుగుతుంటాయి. వరుణ్ ను కలుసుకోకుండానే మీరా అతన్ని లవ్ చేస్తుంది. మీరా ఎలాగైనా అతన్ని కలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. చాలాసార్లు అతన్ని చూస్తుంది. కానీ మాట్లాడడం వీలుకాదు మీరాకు. మొత్తానికి వరుణ్ ను కలుసుకుంటుంది మీరా. అయితే వరుణ్ కు విధిపై నమ్మకం ఉండదు. అయితే తమన్నా నమ్మే విధి లేదని నిరూపించడానికి ఓ టెస్ట్ పెడతాడు వరుణ్.

వరుణ్ ప్రేమను గెలుచుకోవడానికి మీరా ఆ టెస్టుకు అంగీకరిస్తుంది. చిన్న సమస్య వరుణ్, మీరా ప్రేమ జీవితంలో వివాదం సృష్టిస్తుంది. మీరా మంచి కోసం తన నుండి దూరంగా వెళ్ళిపోతాడు వరుణ్. ప్రస్తుతం మీరా వరుణ్ ను కన్విన్స్ చేయడానికే వాలంటైన్స్ డే రోజు ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది. అయితే వీరి మధ్య వచ్చిన ఆ వివాదం ఏమిటి ? వరుణ్ పెట్టిన టెస్ట్ ఏంటి ? మొత్తానికి విధి వాళ్ళను కలుపుతుందా ? మీరా నుండి వరుణ్ ఎందుకు దూరంగా వెళ్ళిపోతాడు ? చివరకు ఏం జరిగింది ? అనేది తెరపై చూడాల్సిందే.

నటీనటుల పనితీరు :
“నా నువ్వే”లో కళ్యాణ్ రామ్ మొదటిసారిగా లవర్ బాయ్ పాత్రలో కన్పించాడు. అయితే తన స్టైల్ తో, హావభావాలతో ఆ పాత్రకు సరిగ్గా సరిపోయాడు. ఇంతకుముందు కళ్యాణ్ రామ్ నటించిన చిత్రాలన్నీ కమర్షియల్, మాస్ పాత్రలే. దీంతో ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఎలా నటిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ ను చూసిన వాళ్ళందరూ లవర్ బాయ్ కు సరిగ్గా సరిపోయాడని అంటున్నారు. ఇక తమన్నా ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. స్క్రీన్ పై తమన్నా మెరిసిపోయింది. తన గ్లామర్ తో ప్రేక్షకులను మైమరపించింది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు జయేంద్ర కథ విషయంలో ఇంకాస్త క్లారిటీగా ఉండి ఉంటే బాగుండేది. 2 గంటల వ్యవధిలో సాగే ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు సినిమాను సాగదీసినట్టుగా ఫీల్ అవుతారు. తాను అనుకున్న పాయింటును ప్రేక్షకులకు సరిగ్గా చూపించలేకపోయాడని చెప్పవచ్చు. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ కొన్ని పాటల్లో, సన్నివేశాల్లో మాత్రమే కన్పిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. షేరేత్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం బాగున్నాయి.

రేటింగ్ : 3/5