కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కె.జి.ఎఫ్’ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కన్నడ సినిమా స్టామినాను పాన్ ఇండియా లెవెల్‌కు తీసుకెళ్లి దర్శకుడు ఈయన. తొలి సినిమా ‘ఉగ్రం’తో బ్లాక్ బస్టర్ అందుకుని తానేంటో నిరూపించుకున్నారు. ఇక రెండో సినిమాతో జాతీయ స్థాయిలో గర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘కె.జి.ఎఫ్: చాప్టర్ 2’తో బిజీగా ఉన్నారు. అయితే, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కాగా గురువారం (జూన్ 4న) ప్రశాంత్ నీల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సెన్సేషనల్ డైరెక్టర్, మనుషుల్లో మాణిక్యం అయిన ప్రశాంత్ నీల్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. త్వరలోనే రేడియేషన్ సూట్‌లో కలుసుకోవాలని వేచి చూస్తున్నాం’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ తరఫున ఒక బర్త్‌డే విషెస్ పోస్టర్ కూడా వదిలారు. కాబట్టి, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ సినిమాను చేయబోతున్నారని ఖరారు అయినట్టే. ఇక్కడ ఇంకో కామన్ పాయింట్ ఉంది. మే 20న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌కు విషెస్ చెప్పినప్పుడు ‘రేడియేషన్ సూట్’ అనే పదాన్ని వాడారు. ఈరోజు ప్రశాంత్ నీల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినప్పుడు ఇదే పదాన్ని నిర్మాతలు కూడా వాడారు. కాబట్టి, వీరిద్దరూ మాట్లాడింది ఎన్టీఆర్ సినిమా గురించేనని స్పష్టమవుతోంది. అయితే, ఈ సినిమా ఎప్పుడు చేస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇక ఎన్టీఆర్‌తో సినిమా కోసం ప్రశాంత్ నీల్‌కు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు రూ.2 కోట్ల భారీ మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించారని ఇండస్ట్రీ టాక్. మరోవైపు ఎన్టీఆర్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే ‘జనతా గ్యారేజ్’ సినిమాను నిర్మించింది. వీరి కాంబోలో ఇది రెండో సినిమా కాబోతోంది.
Wishing @prashanth_neel garu, sensational Director and a gem of a Human very Happy Birthday 💝
Waiting to meet you soon in a Radiation Suit 😊 pic.twitter.com/KWSPD7D0SD
— Mythri Movie Makers (@MythriOfficial) June 4, 2020