telugu navyamedia
తెలంగాణ వార్తలు

మరో 24 గంటలు అప్రమత్తం గా ఉండాలి: సైబరాబాద్ పోలీస్ కమీషనర్

గులాబీ తూఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయనే వాతవారణ శాఖ సూచనతో సైబరాబాద్ కమీషనరేట్ లో సిబ్బంది ని అలెర్ట్ చేశాం. 24 గంటలు అప్రమత్తం గా ఉండాలని టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకి,సిబ్బందికి ఆదేశాలిచ్చాం. సి.ఎస్ గారు, డీజీపీ మహేందర్ రెడ్డి గారి సూచనల ప్రకారం భారీ వర్షాలోస్తే సహాయక చర్యలు చేపట్టేందుకు సైబరాబాద్ లో ప్రత్యేక టీమ్స్ ని ఏర్పాటు చేశాం. జోన్ల వారిగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. 24 గంటలు కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. సహాయక చర్యల కోసం జీహెచ్ఎంసీ సిబ్బంది,అధికారులతో అనుసంధానం చేసుకోవాలని మా సిబ్బంది అధికారులకి సూచించాం.

గతంలో భారీ వర్షాల సమయాల్లో ఎఫెక్ట్ అయిన ప్రాంతాలు , వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర సహాయక చర్యలు చేపట్టేందుకు క్విక్ యాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేశాం. తెలంగాణలో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది, అన్నిశాఖలతో సమన్వయం చేసుకుని పబ్లిక్ కి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతున్నాం. ప్రజలు విద్యుత్‌ సమస్యలు తతెత్తితే కంట్రోల్‌ రూమ్‌ నంబరు 9490617100, 8331013206, 040-278534183, 040-27853412, టోల్‌ఫ్రీ నంబరు 1912 నంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వండి. పోలీసుల సహాయం కోసం డయల్ 100 కి కాల్ చేయండి.

Related posts