2020 సంవత్సరం చిత్ర పరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్ట పోగా.. ప్రముఖ నటులు 2020 లోనే మృతి చెందారు. తాజాగా సీనియర్ సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్ (79) నాగపూర్ లో గుండెపోటుతో శనివారం కన్నుమూశారు. హిందీ, మరాఠీ, భోజ్ పురిలో వందకు పైగా చిత్రాలకు రామ్ లక్ష్మణ్ సంగీతాన్ని అందించారు. రామ్ లక్ష్మణ్ అసలు పేరు విజయ్ పాటిల్. దాదా కోండ్కే కెరీర్ ప్రారంభంలో విజయ్ తో మరాఠీ చిత్రాలకు, ఆ పైన హిందీ చిత్రాలకు స్వరాలు సమకూర్చే అవకాశం కల్పించారు. తన స్నేహితుడు సురేంద్రతో కలిసి విజయ్ ‘రామ్ లక్ష్మణ్’ పేరుతో చిత్రసీమలో సంగీతాన్ని కొన్నేళ్ళు అందించారు. ఇక ఆయన మృతి పట్ల పలుగురు సినిమా ప్రముఖులు సంతాపం తెలిపారు.
previous post