telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆసక్తికరంగా “మర్డర్” ట్రైలర్… పిల్లలని ప్రేమించడం తప్పా?

Murder

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యోదంతంపై ‘మర్డర్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశవ్యాప్త సంచలనం సృష్టించిన మారుతీరావు- అమృత రియల్ స్టోరీ ఆధారంగా ఈ మూవీ రూపొందిస్తున్నారు. వర్మ సమర్పణలో ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘కుటుంబ కథా చిత్రమ్’ అనే ట్యాగ్ లైన్ పెట్టి ఆసక్తి రేకెత్తించిన ఆర్జీవీ.. ఇప్పటికే పలు పోస్టర్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేసి మర్డర్ జరిగిన తీరు, ఆ సన్నివేశాలన్నీ ఆసక్తికరంగా చూపించారు. ”పిల్లలని ప్రేమించడం తప్పా? తప్పు చేస్తే దండించడం తప్పా? వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా?, పిల్లల్ని కనగలం కానీ వారి మనస్తత్వాలను కనగలమా? సమాధానం మీరే చెప్పండి” అంటూ ట్రైలర్ ముగించారు వర్మ. ఈ ట్రైలర్ చూస్తుంటే ప్రణయ్ హత్యోదంతం తాలూకు పూర్తి విషయాలతో ఈ మూవీ రూపొందించారని తెలుస్తోంది. ఇక ఏకంగా 5 భాషలు (తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం)లో ఈ మూవీ విడుదల కానుండటం విశేషం. మీకు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts