telugu navyamedia
సినిమా వార్తలు

“ముంతకల్లు చేతపట్టి…” అంటున్న అల్లు శిరీష్

super response to allu sirish abcd movie first look

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “ఏబీసీడీ”. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే హిందీ శాటిలైట్ డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రేట్ కు అమ్ముడైన విషయం తెలిసిందే. సీనియర్ నిర్మాత డి.సురేష్ బాబు ఈ చిత్రానికి సమర్ఫకులుగా వ్యవహరిస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు ఇందులో అల్లు శిరీష్ కు తండ్రి పాత్రలో నటించారు. బాలనటుడిగా మనకు సుపరిచితమైన భరత్ ఇందులో హీరో ఫ్రెండ్ పాత్రలో నటిస్తున్నాడు. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్. సంజీవ్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘‘ముంతకల్లు చేతబట్టి తాగుతుంటే నువ్వెత్తి… ఒళ్లంతా మత్తెక్కి ఊగిపోదా ఓరబ్బీ… ” అనే పాట విడుదలైంది. ఈ పాట మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

బిగ్ బెన్ సినిమాస్ యశ్ రంగినేని తో కలిసి మధుర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో మధుర శ్రీధర్ ఈ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని మార్చి 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

Related posts