telugu navyamedia
సామాజిక

ఆపదలో ఉన్న వ్య‌క్తికి స‌హాయం చేసిన పోలీస్ అధికారి

ముంబై న‌గ‌రం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం అక్క‌డ రోడ్ల‌న్నీ ర‌ద్దీగా మ‌న‌సులంతా బిజీగా ఉంటారు. అక్క‌డ ఎవ‌రి ప‌ని వాళ్ల‌దే ప‌క్క‌వాడికి స‌హాయం చేసే టైమ్ కూడా ఉండ‌దు.

అయితే ముంబై లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రోడ్డు వద్ద ఓ భిక్ష‌టాన చేసే వికలాంగుడికి ర‌ద్దీగా ఉన్న రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుండ‌గా ఓ మ‌నసున్న‌ పోలీసు అధికారి ఆ వ్యక్తి చేయి పట్టుకుని, రోడ్డును జాగ్రత్తగా దాటడానికి సహాయం చేశాడు.

Traffic cop helps differently-abled man cross a busy road.

అయితే ఆ స‌మ‌యంలో ఆఫీసర్ వీడియోను రికార్డ్ చేస్తున్న ఓ వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్‌లో “ముంబై పోలీస్, హ్యాట్సాఫ్” అని చెప్పడం వినిపించింది. ఆ వీడియో క్లిప్‌ను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌గా అది కాస్తా వైరల్‌గా మారింది.

ముంబై పోలీసు అధికారి చేసిన మంచి ప‌నిని కొంద‌రు ప్రశంసించారు. ముంబై పోలీసుల పట్ల గర్వంగా ఉంది” అని కొంద‌రు మరికొంద‌రు “చాలా గౌరవం గా ఉంద‌ని కామెంట్స్ చేస్తున్నారు.

Related posts