telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూత

mukesh goud

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ (60) కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. పరిస్తితి  విషమించడంతో  హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి  ఆయనను కుటుంబసభ్యులు తరలించారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ముఖేష్ గౌడ్ కు  భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.  

1959 జూలై 1వ తేదీన ముఖేష్ గౌడ్ జన్మించారు. హైదరాబాద్ లోని మహారాజ్ గంజ్, గోషామహల్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009-14 మధ్య కాలంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పని చేశారు. 2014, 2019లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మీద పోటీ చేసి ఓటమిపాలయ్యారు. టీడీపీ నేత దేవేందర్ గౌడ్‌కు ఆయన సమీప బంధువు. ఓవైపు కాంగ్రెస్ దిగ్గజం జైపాల్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ముఖేష్ గౌడ్ మరణ వార్త అందడంతో, రాజకీయ నేతలు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు.

Related posts