telugu navyamedia
క్రీడలు వార్తలు

మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్న ధోని…

గత ఏడాది ప్రపంచ కప్ తర్వాత నుండి క్రికెట్ కు దూరంగా ఉన్న మహేంద్రసింగ్ ధోని ఈ ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక ఆ తర్వాత గత నెల 19న యూఏఈ వేదికగా ప్రారంభమైన ఐపీఎల్ 2020 లో ప్రస్తుతం ఆడుతున్నాడు. కానీ ఈ ఐపీఎల్ సీజన్ లో ధోని పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఈ భారత మాజీ కెప్టెన్ పేరిట క్రికెట్ ప్రపంచం లో చాలా రికార్డులు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి మరో రికార్డు వచ్చి చేరింది. ప్రస్తుతం ఐపీఎల్ 2020 లో చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్న ధోని నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తో జరిగిన మ్యాచ్ లో చాహల్ వేసిన 16 వ ఓవర్లో సిక్స్ బాదడంతో టీ20 క్రికెట్ ప్రపంచం లో 300 సిక్స్ లు బాదిన మూడో భారత ఆటగాడిగా రికార్డు అందుకున్నాడు. ధోని కొట్టిన ఈ 300 సిక్స్ లలో ఐపీఎల్ లోనే 214 బాదాడు. అయితే ఈ రికార్డులో ధోని కంటే ముందు భారత ఆటగాళ్లలో 375 సిక్స్ లతో మొదటి స్థానంలో రోహిత్‌శర్మ, రెండో స్థానం లో సురేశ్‌ రైనా 311 సిక్స్ లతో ఉన్నారు. ఇక మొత్తం టీ20 ఫార్మాట్ లో అత్యధిక సిక్స్ లు బాదిన ఆటగాల్లో 404 సిక్సర్లతో గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక ఇప్పటివరకు మొత్తం 323 టీ20లు ఆడిన ధోనీ 40.01సగటుతో , 135.1 స్ట్రైక్‌రేట్‌ 6,723 పరుగులు చేశాడు. 27 అర్ధశతకాలున్నాయి

Related posts