*కాంగ్రెస్‌కు మరో షాక్
*కాంగ్రెస్ కు ఎంఏ ఖాన్ రాజీనామా
*గులాం నబీ రాజీనామాతో ఖాన్ కూడా రాజీనామా
కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి 24 గంటలు గడవక ముందే మరో సీనియర్ నాయకుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు.
హైదరాబాద్ ఓల్డ్‌సిటీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు ఎంఏ ఖాన్ తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంఏ ఖాన్ కాంగ్రెస్‌లో ఆజాద్ అనుచరుడిగా ఉన్నారు. ఆజాద్ నిన్నటి రోజున కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతోనే ఎంఏ ఖాన్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.