రాష్ట్రంలో 1,04,396 చెట్లు నరికివేత.
రాష్ట్ర వ్యాప్తంగా తగ్గిన 769.66 హెకార్ల అటవీ ప్రాంతం.
రాష్ట్రంలో తగ్గిన చెట్ల వివరాలపై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని).
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లుగా తగ్గిన చెట్ల వివరాలు తెలపాలంటూ విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ సోమవారం లోకసభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర పర్యావరణం, అడవులు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను ప్రశ్నించటం జరిగింది.
అలాగే దేశంలోని అడవుల వెలుపల మొక్కల ప్రణాళిక పై పలు ప్రశ్నలు అడగటం జరిగింది.
ఎపి లో గత ఐదేళ్లుగా అడువుల నుంచి తీసివేసిన ప్రదేశాల వివరాలు జిల్లా వారీగా తెలపాలని అడిగారు? అదే విధంగా ‘అడవుల వెనుక ఉన్న మొక్కలు (Trees Outside Forests in India)’ ప్రణాళిక కింద దేశంలో గత మూడు సంవత్సరాలలో నాటిన మొక్కల సంఖ్య రాష్ట్రాల వారీగా, జిల్లా వారీగా తెలియజేయాలని కోరటం జరిగింది.
ఈ ప్రశ్నలపై కేంద్ర పర్యావరణం, అడవులు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ బదులిస్తూ..
గత అయిదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ లో అక్రమంగా 1,04,396 చెట్లు నరికినట్ల తెలిపారు. అన్నమయ్య జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 27,178 చెట్లు, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కొనసీమ జిల్లా 25,953 చెట్లు అక్రమంగా నరకటం జరిగిందని వివరించారు.
అలాగే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గత ఐదేళ్లుగా అక్రమ చెట్లు నరికి వేత జరిగిందని తెలియజేశారు.
అలాగే ఎపిలో గత ఐదేళ్లగా 769.66 హెకార్ల అటవీ ప్రాంతం తగ్గినట్లు తెలియజేశారు.
రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లా లో 165.07 హెకార్ల అటవీ ప్రాంతం తగ్గిందన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్వల్పంగా 2.24 హెకార్ల అటవీ ప్రాంతం తగ్గిందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం పదకొండు జిల్లాల్లో అటవీ ప్రాంతం గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు.
“భారతదేశంలో అడవుల వెలుపల చెట్లు” (TOFI) ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్, అస్సాం, హర్యానా, ఒడిశా, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లో ప్రారంభించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో గత ఐదేళ్లలో అక్రమం నరికిన 1,04,396 చెట్లు జగన్ కోసమే నరకటం జరిగిందని ఎంపి కేశినేని శివనాథ్ పార్లమెంట్ వెలుపల తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం జగన్ కాన్వాయి వెళ్లే దారిలో జనాలకి కనిపించకుండా పరదాలు కట్టడం, ఆ పరదాలు కట్టడానికి చెట్లు అక్రమంగా నరికివేయటం జరిగిందన్నారు.
జగన్ రాష్ట్రా ఆర్ధిక పరిస్థితినే కాదు..పర్యావర్యాణాన్ని కూడా ఛిన్నభిన్నం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.