telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

వృద్ధ జంటకు వింత అనుభవం… బాత్రూమ్ లో లయన్…!?

Lion

అమెరికాలో ఓ వృద్ధ జంటకు వింత అనుభవం ఎదురైంది. కాలిఫోర్నియాలో నివాసముండే ఈ జంట తమ ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలో వారింట్లోకి ఒక్కసారిగా ఓ మౌంటెన్ లయన్ (పిల్లుల్లో ఒకజాతి) వచ్చింది. దాన్ని చూసిన వారికి ఒక్కసారిగా భయం పుట్టింది. వారి దగ్గరికి ఆ పెద్ద పిల్లి రావడంతో ఒక్కసారిగా గట్టిగా కేకలు వేశారు. దీంతో ఆ పిల్లికి ఏం చేయాలో తెలియక.. ఇల్లు మొత్తం తిరిగి ఓ బాత్రూంలోకి వెళ్లింది. వెంటనే వారిద్దరూ ఆ బాత్రూంకు లాక్ వేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడకు చేరుకున్న వైల్డ్‌లైఫ్ అధికారులు పిల్లిని బాత్‌రూం డోర్ నుంచి బయటకు వదిలేశారు. ఈ పిల్లులు చాలా కోపంగా ఉంటే తప్ప మనుషులకు ఎటువంటి హానికరం చేయవని అధికారులు తెలిపారు. ఇంట్లో ఉన్న సమయంలో ఇంటి తలుపులు వేసుకుని ఉండటం మంచిదని వారు సలహా ఇచ్చారు.

Related posts