telugu navyamedia
సినిమా వార్తలు

ప్లాస్టిక్ సర్జరీతో అందాన్ని కోల్పోయిన మరో హీరోయిన్

Mouni-Roy

సహజ సౌందర్యాన్ని వదిలేసి కృత్రిమ సౌందర్యం కోసం పాకులాడిన కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీని ఏలినా… చాలామంది హీరోయిన్లు తమ అందాన్ని శాశ్వతంగా కోల్పోయిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి మౌనిరాయ్ బుల్లితెర క్వీన్ గా ఓ వెలుగు వెలిగింది. బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించింది. స్టార్ హీరోయిన్లకు పోటీనిచ్చే సౌందర్యం మౌనిరాయ్ సొంతం. ఇటీవల మౌనిరాయ్ తన అందాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ బాట పట్టింది. పలు సర్జరీల అనంతరం ఇటీవల ఓ ఈవెంట్ లో మౌనిరాయ్ మెరిసింది. ఆమెని చూసినవారంతా నోరెళ్లబెడుతున్నారు. సహజ సౌందర్యంతో గతంలో ఏంజల్ లా కనిపించిన మౌనిరాయ్ ముఖంలోని మెరుపు ప్లాస్టిక్ సర్జరీ కారణంగా నాశనమైందని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మౌని రాయ్ ఇప్పుడు రాఖి సావంత్ లా కన్పిస్తోందని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

Related posts