ఆర్టీసీ కార్మికులు చేపట్టిన తెలంగాణ బంద్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. కార్మికులు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బంద్‌కు ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించి బంద్‌లో పాల్గొన్నాయి. బంద్ నేపథ్యంలో కార్మికులకు మద్దతుగా సికింద్రాబాద్ లోని జేబీఎస్ బస్టాండ్ వద్ద మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్పింహులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో మోత్కుపల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయంలో సీఎం కేసీఆర్ తన మొండి వైఖరి వీడాలనివిమర్శించారు. ఆయన తన కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు సూచించినప్పటికీ కేసీఆర్ నోరు మెదపడం లేదని అన్నారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు.