టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు.
ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలనుకున్న మేకర్స్ కరోనా కారణంగా పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకి విజయదశమి పండుగ సందర్భంగా అక్టోబర్ 8న రిలీజ్ చేస్తున్నట్టు ఓ కొత్త పోస్టర్ విడుదల చేసిన చిత్ర యూనిట్ అందులో ఏ గెటప్స్ లో ఉన్న అఖిల్‌ను చూపించారు. దీంతో అక్కినేని అభిమానులు పుల్ కుషీ అవుతున్నారు.
కాగా అఖిల్ గత మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పటి వరకూ హిట్ లేని అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీతోనైనా సూపర్ హిట్ అందుకుంటాడా లేదా చూడాలి. కాగా అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ అనే సినిమా చేస్తున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్.
నాపై విమర్శలు… నటనతోనే చెక్ పెడతా : కార్తికేయ