telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“నందులా … చుంచులా?” మురళీ మోహన్

morali mohan on nandi award

ముప్పయ్ మూడు సంవత్సరాల నాటి సంగతి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న నంది అవార్డులపై మురళి మోహన్ చేసిన కామెంట్ అది. 1985 ఏప్రిల్ 10వతేదీన అంటే 33 సంవత్సరాల క్రితం ఇదేరోజు. ఆ సంవత్సరం ఉత్తమ నటుడు గా ఎంపికైన మాగంటి మురళి మోహన్ చేసిన ఘాటైన విమర్శ సంచలనం కలిగించింది. అప్పుడు ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారు వున్నారు. మురళి మోహన్ చేసిన ఆ విమర్శ అన్ని పత్రికల్లో ప్రదానం గా వచ్చింది. ఈ వార్త చూసిన ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు సమాచార, ఫిలిం అభివృద్ధి సంస్థ అధికారులను పిలిచి వచ్చే సంవత్సరం నుంచి
నందుల సైజు పెంచమని ఆదేశాలిచ్చారు.

ఇది ఎలా జరిగిందంటే, నంది అవార్డులు వచ్చిన వారితో ఫిలిం క్రిటిక్స్ ఇష్టాగోష్టి సమావేశం ఏర్పాటు చేయడం ఆనవాయితి. ఆరోజు ఉగాది హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఉదయం అవార్డు విజేతలతో సమావేశం ఏర్పాటు చేశాము. అప్పుడు జి .ఎస్ వరద చారి అధ్యక్షుడుగా నేను కార్యదర్శిగా వున్నాను. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను క్రమం తప్పకుండా ఇచ్చేది. 1985వ సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా “మయూరి”, ద్వి తీయ ఉత్తమ చిత్రంగా “ఓ తండ్రి తీర్పు”, తృతీయ ఉత్తమ చిత్రంగా “వందేమాతరం” సినిమాలు ఎంపికయ్యాయి. ఉత్తమ నటుడుగా “ఓ తండ్రి తీర్పు ” చిత్రంలా నటించిన మురళి మోహన్, ఉత్తమ నటిగా “ప్రతిఘటన” లో నటించిన విజయ శాంతి. ఉత్తమ దర్శకుడుగా “మయూరి సినిమాకు దర్శకత్వం వహించిన సింగీతం శ్రీనివాసరావు, ఉత్తమ ఛాయాగ్రాహకుడుగా “మయూరి ” చిత్రానికి హరి అనుమోలు, “ప్రతిఘటన” చిత్రంలోని పాటకు ఎస్.జానకి, ఉత్తమ సంభాషణల రచయిత “ప్రతిఘటన ” చిత్రానికి ఎమ్.వి.ఎస్ హర్నాథ రావు, ఇక వందేమాతరం మూడవ అవార్డు సంపాదించిన చిత్ర దర్శకుడుగా, ప్రతిఘటన ఆ సంవత్సరం ఆరు అవార్డులను గెలుచుకుంది. 

morali mohan on nandi awardఈ చిత్ర దర్శకుడు టీ.కృష్ణ ప్రధాన ఆక్షర్షణః గా వున్నారు. ఈ సమావేశంలో మురళి మోహన్, నిర్మాత వై.హరికృష్ణ, మయూరి, ప్రతిఘటన చిత్రాల ఎగ్జిక్యూటివ్ నిర్మాత అట్లూరి రామారావు, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, కళా దర్శకుడు భాస్కర రాజు, మయూరి చిత్ర రచయిత గణేష్ పాత్రో, హర్నాథ రావు, ఎస్.జానకి, హరి అనుమోలు తదితరులు పాల్గొన్నారు. మొదట్లో నందులు పెద్ద సైజు లో ఉండేవి. ఆ తరువాత ఎందుకో చిన్నవిగా మారిపోయాయి. ఈ విషయం గురించిమురళీ మోహన్ మాట్లాడుతూ … “నదుల అవి చుంచులా” అన్నాడు. ఆ వార్త అన్ని దిన పత్రికల్లో ప్రధానంగా వచ్చింది. దీనిపై ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు మండిపడ్డ్డాడు. వచ్చే సంవత్సరం నుంచి నదుల సైజు పెంచమని ఆదేశించాడు. ఆ తరువాత సంవత్సరం నుంచి నంది అవార్డుల సైజు పెరిగింది. అప్పుడు విమర్శను కూడా సహృదయంతో స్వీకరించే నాయకులు ఉండేవారు అని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం.

– భగీరథ

Related posts