telugu navyamedia
ఆంధ్ర వార్తలు

విజయవాడలో మంకీపాక్స్ కలకలం

విజయవాడలో మంకీపాక్స్ కలకలం రేపుతోంది. విజయవాడలో దుబాయ్ నుంచి వచ్చిన కుటుంబంలో చిన్నారికి మంకీపాక్స్ సోకినట్లు లక్షణాలు కన్పించాయి.

చిన్నారి ఒంటిపై దద్దుర్లు రావడంతో వైద్యశాఖాధికారులు ముందు జాగ్రత్తగా ఆ కుటుంబాన్ని ఐసొలేషన్ లోకి పంపారు. చిన్నారి నుంచి సేకరించిన రక్త నమూనాలను పరీక్షల కోసం పూణే ల్యాబ్ కు పంపారు.

అయితే అయితే మంకీపాక్స్ లక్షణాలు ఉన్నా.. ఇంకా నిర్ధారణ కాలేదని వైద్యులు తెలిపారు. చిన్నారితోపాటు కుటుంబసభ్యులకు చెందిన నమూనాలను ల్యాబ్‌కు పంపినట్లు డాక్టర్లు చెప్పారు.

నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని, అంతవరకు గోప్యంగా ఉంచుతున్నామని అన్నారు. సోమవారం సాయంత్రానికి నివేదిక వచ్చే అవకాశం ఉందని, ప్రస్తుతం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.

ప్రపంచంలో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందుతుంది. దేశంలోని కేరళ రాష్ట్రంలో తొలి మంకీ పాక్స్ కేసు నమోదైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే పలు రాష్ట్రాలను అలెర్ట్ చేసింది.జ్వరం, దగ్గు, శరీరంపై దద్దుర్లు రావడం ఈ వ్యాధి లక్షణాలుగా చెబుతున్నారు. మంకీపాక్స్ సోకిన వారి నుండి ఇతరులకు కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందనుంది.

మంకీపాక్స్ వ్యాధి సోకిన వారిని ఎవరెవరు కలిశారనే విషయాలపై కూడా వైద్య ఆరోగ్య శాఖాధికారులు వివరాలు సేకరించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ముగియకముందే మంకీపాక్స్ దేశంలో కలకలం రేపుతుంది. విదేశాల నుండి వచ్చిన ప్రయాణీకులను వైద్యశాఖాధికారులు పరీక్షించనున్నారు.

Related posts