telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘సర్కారు వారి పాట’ లో బిగ్ బాస్ బ్యూటీ !

పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతుండగా, జి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమాలో మహేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం విదేశాల్లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చింది.  అయితే ఈ సినిమాలోని పక్కా మాస్ స్పెషల్ సాంగ్ చేసే అవకాశాన్ని బిగ్ బాస్ బ్యూటీ దక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ షోతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న ముద్దుగుమ్మల్లో మోనాల్ గజ్జర్ కూడా ఒకరు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందిన అల్లుడు అదుర్స్ సినిమాలో స్పెషల్ సాంగ్ మోనాల్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మహేష్ సినిమా సర్కారు వారి పాటలో కూడా స్పెషల్ సాంగ్‌ కోసం మోనాల్‌తో చర్చలు జరిపారట. మరి ఈ ఆఫర్‌కు మోనాల్ ఏమంటుందో వేచి చూడాలి.

Related posts