ధోనీ హెలికాఫ్టర్ షాట్ కొడితే.. కచ్చితంగా బంతి స్టాండ్స్‌లోకి వెళ్లాల్సిందే. కెరీర్ ప్రారంభంలో ధోనీ ప్రవేశపెట్టిన ఈ షాట్‌ను ఎందరో యువ క్రికెటర్లు ఆడేందుకు ప్రయత్నించారు. వీరిలో కొందరు సఫలమైతే.. మరి కొందరికి మాత్రం పరాభవం తప్పలేదు. కష్టతరమైన ఈ వినూత్న షాట్ ఆడాలంటే టైమింగ్‌తో పాటు బ్యాక్ హ్యాండ్ పవర్, ఐ కాంటాక్ట్ కీలకం. అలాగే బంతి లెంగ్త్‌ను కూడా సరిగ్గా అంచనా వేయాలి. ఎంతో ప్రాక్టీస్ ఉంటే తప్పా ఈ షాట్ ఆడటం అంత సులువు కాదు. అందుకే ఈ షాట్ ఆడటం ధోనీ ఒక్కడికే సాధ్యమైంది. తన ట్రెడ్ మార్క్ షాట్‌గా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. అయితే ఈ హెలికాప్టర్ షాట్ ధోనీ కన్నా ముందే ఉందనే చర్చ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఊపందుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఈ తరహా హెలీకాప్టర్ షాట్స్ ఆడాడని ఓ వర్గం అభిమానులు వాదిస్తున్నారు. అతని హెలికాప్టర్ షాట్‌కు సంబంధించిన వీడియో వైరల్‌ను చేస్తున్నారు. 1996లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అజారుద్దీన్ ఈ షాట్ ఆడాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో అజార్ (77 బంతుల్లో 18 ఫోర్లు, సిక్స్‌తో 109) సెంచరీతో చెలరేగాడు. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ లాన్స్ క్లుసెనర్ వేసిన ఓ ఓవర్‌లో అజారుద్దీన్ ఐదు ఫోర్లు కొట్టాడు. అయితే ఈ ఓవర్‌లో అజారుద్దీన్ రెండు ఫోర్లు కొట్టిన తర్వాత క్లుసెనర్ యార్కర్ వేస్తాడని భావించిన అజారుద్దీన్.. అతని లెంగ్త్‌ను పసిగట్టి హెలిక్యాప్టర్ షాట్‌తో బంతిని డీప్ వికెట్ మీదుగా బౌండరీ తరలించాడు. ఆ మ్యాచ్‌లో క్లుసెనర్‌ను అజారుద్దీన్ చీల్చిచెండాడాడు.
previous post
next post
చంద్రబాబు ట్రంప్ తోనైనా పొత్తు పెట్టుకోగలరు: మంత్రి అనిల్