modi

నేడు ఛత్తీస్గఢ్ లో మోడీ పర్యటన

14

ఈరోజు ఛత్తీస్గఢ్ లో మోడీ పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారిక షెడ్యూల్ ను కూడా ప్రకటించారు అధికారులు. ఛత్తీస్గఢ్ చేరుకొన్న తరువాత భిలాయ్ ఉక్కు కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు మోడీ. ఆ తరువాత జగదల్ పూర్, రాయపూర్ మధ్య విమాన సర్వీసులు ప్రారంభించనున్నారు.

అయితే నిన్న మోడీ చేసిన ఫిట్నెస్ ఛాలెంజ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోను నెటిజన్లు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ లైకులు కొట్టడం విశేషం. అయితే మోడీ ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ ను కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి విసరగా, కుమారస్వామి ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే.