BREAKING NEWS:
healthcare-challenges1

మోడీ గారు చట్టాల అమలుకు ఛాలెంజ్ లు లేవా ?

39

ఒకవైపు దేశం పోరోగమిస్తుందని ఉపన్యాసాలు,మరోవైపు ఫిట్నెస్ ఛాలెంజ్ లు ఇప్పుడు ఇవ్వే మన దేశం లో నడుస్తున్న ట్రెండ్. ట్రెండ్ ను సెట్ చేయవలసిన నాయకులే ఇప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. ఈ మధ్య ఫిట్నెస్ ఛాలెంజ్ వీడియోలు సామజిక మాద్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ,వాట్స్ అప్ లలో చక్కర్లు కొడుతున్నాయి. తొలుత కేంద్ర మంత్రి రాజవర్ధన్ సింగ్ రాథోడ్ ఈ ఛాలెంజ్ ని విసిరాడు. మనం ఫిట్ అయితే దేశం ఫిట్ అని. దీనిని ఛాలెంజ్ గా స్వీకరించిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తాను కసరత్తు చేసే వీడియో ను రికార్డు చేసి సామజిక మాధ్యమాలలో పోస్ట్ చేసి ,దేశ ప్రధానికి ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ ని విసిరాడు. దీనిని స్వీకరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా తాను వ్యాయామం చేసే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దీనిని స్వీకరిన్చాల్సిందిగా కర్ణాటక సీఎం కుమారస్వామి కి యువ ఐఏఎస్ ఆఫ్ఫీసుర్లకు ఛాలెంజ్ విసిరారు. దీనికి స్పందించిన కుమార స్వామి తాను ఫిట్గా ఉన్నానని రోజు వ్యాయామం చేస్తానని, తన ప్రభుత్వం రాజకీయం గా ఫిట్గా  ఉండడానికి ప్రధాని సహకరించాలని ట్వీట్ చేసారు.

pm-modi-accepts-vira-kohlis-challenge-posts-his-fitness-video

నిజానికి ఈ ఫిట్నెస్స్ అందరికి అవసరమే, పెరిగే శరీర ఆకృతిని తగ్గించుకోవడానికి ఫిట్నెస్ అవసరం. కానీ మనదేశంలో పెరిగిన శరీరంతో ఉన్నవారికంటే డొక్క ఎండిన మనుషులే ఎక్కువ ,అన్నార్తులు, ఆనాధలు ఎక్కువ ఈ దేశంలో. పౌష్టికాహారం లేక ఎదగలేక కుంటుపడుతున్న బ్రతుకులు ఎన్నో ,తాగడానికి నీరు కూడా సరిగాలేక ఫ్లోరోసిస్ బారిన పడిన బ్రతుకులు ఎన్నో, వీటిని ఛాలెంజ్ గా ఎవరు తీసుకోరు ఎందుకు ?

modi ji is there any challenges for act

మానవ ఆయు ప్రమాణాన్ని పెంచే ఉదేశ్యంగా చేసిన ఏ చట్టాలు ఈ దేశంలో అమలుకు నోచుకోవు. బహిరంగ ధూమపానం నేరం అని చట్టం చేసిన ప్రయోజనం లేదు. మరి దీనిని ఎందుకు ఛాలెంజ్ గా తీసుకోరు అని సామాన్యుల ప్రశ్న. బీహార్లో మద్యపానాన్ని నిషేదించారు. ఇప్పుడు దాన్ని కూడా ఎత్తివేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆహార కల్తీని అరికట్టలేక పోతున్నారు,మార్కెట్లో దొరికే కల్తీ ఆహార పదార్థాలు సామాన్యుల ప్రాణాల్ని హరిస్తున్నాయని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు . గుట్కా ప్యాకెట్లను దేశంలో నిషేదించినా దొంగతనం గా విచ్చలవిడిగా అమ్ముతున్నారు దీనిని అరికట్టడం ప్రభుత్వాలు ఛాలెంజ్ గా ఎంధుకు తీసుకోవడం లేదు అంటున్నారు సామాన్యులు . ఎన్నో సమస్యలు ప్రధానమైనవి ఉండగా వాటన్నింటిని మరచి కేవలం ఈ ఫిట్నెస్ ను ఛాలెంజ్ గా తీసుకోవడం సామాన్యులకు విస్మయాన్ని కలిగిస్తుంది . నిరుద్యోగం ,వ్యవసాయం ,విద్య ,వైద్యం, ఉగ్రవాదం వీటన్నింటి ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకుంటే బాగుంటుంది అని విశ్లేషకులు అంటున్నారు.

modi ji is there any challenges for act

మోడీ అభిమానులు మాత్రం యోగ డే కోసం మోడీ ఈ పోస్ట్ చేసి ఉండొచ్చునని అంటున్నారు. “ఆరోగ్యం కలు ధర్మ సాధనం “అని అంటున్నారు. ఏ పని చేయాలన్న ముందు మనం ఆరోగ్యం గా ఉండాలని అందుకు ఫిట్నెస్ ఛాలెంజ్ అవసరం అంటున్నారు మోడీ భక్తులు. ఏది ఏమైనా కల్తీ పదార్థాలు ,మద్యపానం,ధూమపాన ఫై చేసిన చట్టాలను మొదలు ఛాలెంజ్ గా తీసుకొని అమలు చేయాలనీ విమర్శకుల మాట. ఫిట్ గా ఉన్నా ఇవి బయట దొరకడం వల్ల ఎంతో మంది వీటికి బానిసలై రోగాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు.వీరిలో దేశ అభువృధికి వెన్నుముక అయిన యువతే ఎక్కువ అంటున్నారు విశ్లేషకులు.

                                                                                                                         సంతోష్ కుమార్