telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌ పాలనలో విద్యావ్యవస్థ నిర్వీర్యం: జీవన్‌రెడ్డి

Congress Jeevan Reddy Contest MLC

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పాలన పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేజీ టూ పీజీ నిర్బంధ విద్యను అటకెక్కించారని ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో విద్యావ్యవస్థ నిర్వీర్యమైందని విమర్శించారు. ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు.

రైతు సమస్యల పై ప్రభుత్వం సకాలంలో స్పందించడం లేదని దుయ్యబట్టారు. రుణమాఫీపై కేసీఆర్‌ ఎందుకు స్పందించడంలేదని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ ను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు. అయినపట్టికీ ఆయన మాత్రం ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారని విమర్శించారు. స్పీకర్‌ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి కోల్పోయి, అధికార పార్టీలో భాగమైందని జీవన్‌రెడ్డి ఆరోపించారు.

Related posts