telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఎమ్మెల్సీ మాజీ కారు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

* ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యకు ప్రభుత్వ ఉద్యోగం
*కలెక్టర్ చేతుల మీదుగా నియామక పత్రం
*ఉద్యోగం ఇస్తామని గతంలో ప్రభుత్వం హామీ
*ఆరోగ్యశాఖ లో ఆమెకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం

కాకినాడలో హత్యకు గురైన ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగమిచ్చారు.

ఎస్సీ, ఎస్టీ (పీవోఏ) చట్టం కింద ఈమెకు ఉద్యోగమిస్తూ కలెక్టర్‌ కృతికా శుక్లా సోమవారం స్పందన కార్యక్రమంలో ఉత్తర్వులను అందజేశారు. అపర్ణ అర్హత ధ్రువపత్రాలను పరిశీలించి, కాంపేషనేట్‌ నియామక ఉత్తర్వులు జారీ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఎ.హనుమంతరావును కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

Kakinada Mlc Anantababu Driver Subrahmanyam Wife Aparna Got Govt Job In Health  Department Dnn | Kakinada News : సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు ప్రభుత్వ  ఉద్యోగం, ఆరోగ్యశాఖలో జాబ్ ఇస్తూ ...

కాగా..కాకినాడకు చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య సంచలనం రేపింది. ఎమ్మెల్సీ అనంతబాబు ఈ కేసులో అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్నారు. ఆయన్ను ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

ఆయన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. మరోవైపు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం అంటున్నారు. ఈ మేరకు గవర్నర్, సీఎస్, డీజీపీలకు లేఖ రాశారు.

Related posts