telugu navyamedia
రాజకీయ

దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌పెట్టుకుంటున్న నేత‌లు..!

ప్ర‌స్తుత రాజ‌కీయంలో ట్రెండ్ మారింది. ప్ర‌స్తుతం వార‌స్వ‌తం హావా న‌డుస్తోంది. ఒక సారి రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేసిన కుటుంబాల నుంచి త‌రత‌రాలుగా వారి వార‌సులే పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో ఆయా అధిష్టానాలు కూడా పొలిటిక‌ల్ బ్యాక్‌గ్రౌండ్ లేదా సినిమా, త‌దిత‌ర‌ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేత‌ల‌కు టికెట్లు కేటాయిస్తూ వ‌స్తున్నారు.

అదే త‌ర‌హాలో దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌పెట్టుకోవాల‌నే సామెతను ఆ జిల్లాలో ఉన్న రాజ‌కీయ నేత‌లు రుజువు చేస్తున్నారు. క‌ర్నూలు జిల్లాలోని ఆ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల నేత‌లు కంటే త‌న‌యులే రాజ‌కీయ కార్యక్ర‌మాల్లో చురుగ్గా ఉంటూ భ‌విష్య‌త్తులో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌లు త‌మ వార‌సుల‌కే బ‌రిలోకి దించే ప్రాణాళిక‌ల‌ను రూపొందించుకుంటున్నారు. ఈ విష‌యం పై వైఎస్ఆర్ సీపీలో పెద్ద చ‌ర్చ జ‌రుగుతుందంట‌!

అంతేకాకుండా 2024 ఎన్నిక‌లుకు ముందే .. ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌వ్వ‌ల‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వ కార్యక్ర‌మాలో కూడా వార‌సులు చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ వ్యవహారంలో ముందు వరుసలో ఉన్నార‌ట‌ ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి. తన కొడుకుని ఎమ్మెల్యేగా చూడాలన్న కల సాకారం చేసుకొనేందుకు జయమనోజ్‌ రెడ్డిని రాజకీయ వారసుడిగా నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేసేశారు. నియోజకవర్గంలో అన్ని అంశాల్లోను తనదైన శైలిలో చొరవ చూపిస్తున్నాడు జయమనోజ్ రెడ్డి. ఎమ్మెల్యే కొడుకుగా అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు చేస్తూ సలహాలు ఇచ్చేస్తున్నారట.

ఇక మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కూడా సాయిప్రసాద్ రెడ్డి మార్గాన్ని ఎంచుకున్నారంట‌. తన తరువాత రాజకీయ వారసునిగా అన్న కుమారుడు ప్రదీప్‌కుమార్‌రెడ్డిని రంగంలో దింపుతున్నట్లు సమాచారం. బాలనాగిరెడ్డి కుమారుడు ధరణీరెడ్డి ఉన్నా.. యాక్టివ్‌ రోల్‌ మాత్రం ప్రదీప్‌ మాత్రమే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారిక కార్యక్రమాల్లో ప్రధాన ఆకర్షణ ప్రదీపేనంట‌.

ఏది ఏమైనా రాజ‌కీయ‌మ‌నే కంచు కోట‌పై మ‌రొక‌రు క‌ర్చీఫ్ వేయ‌కుండా త‌న వార‌సుల‌కే కుర్చోబెట్టాల‌ని నేత‌లు ఆలోచ‌న‌లు చ‌ర్చానియాంశంగా మారింది.

Related posts