ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబుకు సిఐడి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత నెలలో కొంతమంది ఎస్సీ, ఎస్టి రైతులు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేను కలిసి భూములపై ఫిర్యాదు చేశారు. ఆ తరువాత గతనెల 24 వ తేదీన ఎమ్మెల్యే ఆర్కే ఇదే విషయంపై ఏపీ సిఐడికి ఫిర్యాదు చేశారు. ఎస్సి, ఎస్టీ రైతుల్ని బెదిరించి కుట్రతో భూములు లాక్కున్నారని ఆర్కే ఫిర్యాదులో పేర్కొన్నారు. పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను ప్రభుత్వమే తీసుకుంటుందని బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిఎస్పీ సూర్యభాస్కరరావు నేతృత్వంలోని సిఐడి బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఈనెల 12 వ తేదీన ఈ కేసుకు సంబంధించిన నివేదికను అధికారులకు అందజేశారు. దీంతో అదే రోజున కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబుపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీతో సహా మరో 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక భూసేకరణ విషయంలో అక్రమాలు జరిగినట్టు సిఐడి నిర్ధారణకు వచ్చింది. చూడాలి మరి ఇంకా ఈ కేసులో ఏ విషయాలు వెలుగులోకి వస్తాయి అనేది.
previous post