telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దానిపై డెడ్ లైన్ పెట్టె దమ్ము బండి సంజయ్ కి ఉందా..?

jaggareddy in pcc race in telangana

టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి కాంగ్రెస్ ని లేకుండా చేయాలని టీఆర్‌ఎస్‌, ఎంఐఎం చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఫైర్‌ అయ్యారు. అమిత్ షాని కేసీఆర్ ఎందుకు కలిశారన్నది అనుమానం ఉందని… రాష్ట్రంలో లా అండ్ ప్రాబ్లం లేదు… నక్సలైట్ల సమస్య అసలే లేదని తెలిపారు. ప్రధానిని కేసీఆర్ కలిసిన తర్వాత బండి సంజయ్ ఢిల్లీకి పోవడానికి కారణం ఏంటి ? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ని జైల్లో పెడతా అనడం ఏంటో చెప్పాలని… కేసీఆర్ ని జైల్లో పెడతా అంటున్న బండి సంజయ్ ఏదైనా డెడ్ లైన్ పెట్టుకున్నారా..? అని నిలదీశారు. ఇప్పటికే 10 సార్లు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారని… డెడ్ లైన్ పెట్టె దమ్ము సంజయ్ కి ఉందా..? అని సవాల్‌ విసిరారు. ఢిల్లీ బీజేపీ నాయకులు కేసీఆర్ తో విందులు..వినోదాలు చేస్తున్నారని.. హైదరాబాద్ బీజేపీ నాయకులు…కేసీఆర్ మధ్య చిందులు నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ని బీజేపీ జైలుకు పంపదని… కేసీఆర్ జైల్ కి పోడని…రెండు పార్టీలు రాజకీయ డ్రామాలు వేస్తున్నాయని ఫైర్‌ అయ్యారు. బండి సంజయ్ ని ఢిల్లీకి పిలిచి మాట్లాడించడం వెనక బీజేపీ నాటకం ఉందని పేర్కొన్నారు జగ్గారెడ్డి.

 

 

Related posts