telugu navyamedia
తెలంగాణ వార్తలు

నేనే త‌ప్పుచేశా..

కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ , సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుక్రవారం రోజున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డిపై చేసిన వ్యాఖ్యల దుమారం సద్దుమణిగింది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తప్పేం లేదని, తనదే తప్పని ఒప్పుకున్నానన్నారు. క్షమాపణలు కూడా చెప్పానని చెప్పారు.

రేవంత్ రెడ్డి, తాను అన్నదమ్ముల్లాంటి వాళ్లమన్న ఆయన.. . అన్నదమ్ములం అన్నప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి. మళ్లీ కలిసిపోతామ‌ని, సమాచారలోపంతోనే నిన్నటి వివాదం తలెత్తినట్లు పేర్కొన్నారు. ఏఐసీసీ కార్యదర్శులు కొన్ని సూచనలు చేశారు. నా తప్పును అడిగారు, మరోసారి మాట్లాడనని వివరణ ఇచ్చాను. నిన్నటి అంశం నిన్నటితోనే మరిచిపోవాలని కోరార‌ని అన్నారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తా. అంతర్గత విషయాలను బయట మాట్లాడొద్దని ఏఐసీసీ చెప్పారన్న జగ్గారెడ్డి.. ఇకపై నేరుగా పార్టీ వ్యవహారాలు మీడియాతో మాట్లాడనన్నారు. నేను తప్పు ఒప్పుకున్నాను’ అంటూ జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు. ఇక‌పై అధికార తెరాసపైనే తమ యుద్ధమని స్పష్టం చేశారు.

Related posts