కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే కారు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి కూడా అయిన సీటీ రవి కారు చిక్కమగళూరు నుంచి బెంగళూరు వైపు వేగంగా వస్తూ అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగివున్న మరో కారును ఢీకొంది. ఈ ఘటనలో శశికుమార్ (28), సునీల్‌గౌడ (27)లు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మునిరాజు, జయచంద్ర, పునీత్, మంజునాథ్ అనే యువకులను స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
ప్రమాదం తీవ్రతకు సి.టి.రవి కారు డ్రైవర్ ఆకాశ్, గన్‌మ్యాన్ రాజునాయక్ కూడా గాయపడ్డారు. ఎమ్మెల్యే సి.టి.రవికి కూడా కొద్దిపాటి గాయాలయ్యాయి. వీరిలో డ్రైవర్ ఆకాశ్ బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.మృతులను రామనగర్, కనకపుర నివాసులుగా గుర్తించారు. ప్రమాదం అనంతరం తీవ్రషాక్‌కు లోనైన ఎమ్మెల్యే సి.టి.రవి మృతుల కుటుంబాలనుగానీ, బాధితులను గానీ పరామర్శించకుండా వెళ్ళిపోవడంతో ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులు ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సచివాలయం కట్టడం కాదు పేదలకు ఇల్లు కావాలి.. కేసీఆర్ పై భట్టి ఆగ్రహం