telugu navyamedia
తెలంగాణ వార్తలు

కొల్లాపూర్‌లోతీవ్ర ఉద్రిక్తత : పోలీసుల అదుపులో ఎమ్మెల్యే హర్షవర్థన్

*కొల్లాపూర్‌లో ముదిరిన రాజకీయ స‌వాల్లు
*కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అరెస్టు

*తాండూరు పోలీస్ స్టేష‌న్‌కి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌కి త‌ర‌లింపు

*జూపల్లి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

*ఎమ్మెల్యేను తరలిస్తున్న పోలీసు వాహనం వెంట భారీగా వెళ్తున్న కార్యకర్తలు

*కొల్లాపూర్‌లో కొన‌సాగుతున్న హైటెన్ష‌న్‌

కొల్లాపూర్‌లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నియోజకవర్గం అభివృద్ధి, అవినీతి విషయంలో బహరంగ చర్చపై టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే హర్షవర్థన్, మాజీ మంత్రి జూపల్లి సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. దీనిపై ఆదివారం ఇరువురి మధ్య చర్చ జరగనుంది. ఈ నేపథ్యలో బీరం హర్షవర్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను పోలీసులు హౌస్ అరెస్టుచేశారు

ఈ క్ర‌మంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లేందుకు తమ అనుచరులతో హర్షవర్థన్ భారీ ర్యాలీ తరహాలో బయటికి రాగా పోలీసులు వారిని అడ్డు కున్నారు. 

బీరం హర్షవర్ధన్ రెడ్డికి పోలీస్‌ తొలుత నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే తాను మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్తానని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. దీంతో  హర్షవర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీంతో ఆయన అనుచరులు పోలీసుల వాహనాలను కదలకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యేను వదిలిపెట్టాలని వారు డిమాండ్ చేశారు.కొల్లాపూర్‌లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కొల్లాపూర్‌లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

మరో వైపు తన ఇంటికి ఎమ్మెల్యే వస్తే సాదరంగా ఆహ్వానించేందుకు సిద్దంగా ఉన్నానని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా తన ఇంటి గేటు వద్ద వేచి ఉన్నాడు.

Related posts