meira-kumar-on-kcr

కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన మీరా కుమార్

25

తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛను హరించే యత్నం జరుగుతోందని, దళితులకు పాలించే హక్కు లేదా? అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీలపై లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళితుడిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు.

డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను ఆ పదవి నుంచి తొలగించారని అన్నారు. దళిత ఎమ్మెల్యే సంపత్ ను శాసనసభ నుంచి బహిష్కరించారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని ఆమె మండిపడ్డారు.