ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమ్మఒడి పథకంపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. అమ్మఒడి పథకం ప్రస్తుతానికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకే వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. మంత్రిగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్ల విద్యార్ధులకు అమ్మఒడి వర్తింప చేసే అంశంపై మేథోమధనం చేస్తున్నామన్నారు.
డ్రాప్‌ఔట్ల సంఖ్య తగ్గించేందుకే అమ్మఒడి పథకం తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అమ్మఒడి పథకం విధి విధానాలు తెలియకుండా ఆ పేరు చెప్పి అడ్మిషన్లు తీసుకునే స్కూళ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమ్మఒడి పథకం వర్తింపునకు ఇంకా ఆరు నెలల సమయం ఉందని మంత్రి తెలిపారు.