telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగనన్న మనసులో నుంచి పుట్టిన చట్టమే దిశ: హోమ్ మంత్రి సుచరిత

sucharith home minister

బాలికలపై అత్యాచారాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు వేసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ‘ఏపీ దిశ యాక్ట్’ నేడు అసెంబ్లీ ముందుకు వచ్చింది. హౌస్ లో బిల్లును ప్రవేశపెట్టిన హోమ్ మంత్రి సుచరిత, “ఆంధ్రప్రదేశ్ లో మహిళలందరికీ జగనన్న ఒక రక్ష – ఎవరైనా మహిళలపై చెయ్యి వేస్తే పడుతుంది కఠిన శిక్ష” అని వ్యాఖ్యానించారు.

‘ఏపీ దిశ యాక్ట్’ చట్టంద్వారా ఏదైనా నేరం జరిగితే, నేరస్తులు నిర్భయంగా తిరిగే పరిస్థితి ఉండదని, 14 రోజుల్లో విచారణ పూర్తయి, 21 రోజుల్లోనే శిక్ష పడుతుందని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నామని అన్నారు. రాష్ట్రంలోని మహిళలకు భరోసాను కల్పించేలా, ఓ అన్నగా జగనన్న మనసులో నుంచి వచ్చిన ఆలోచనే ఈ బిల్లు అని మంత్రి వ్యాఖ్యానించారు.

ఢిల్లీలో నిర్భయ నుంచి హైదరాబాద్ లో దిశ ఘటన వరకూ అన్నీ చూశామని, ఇకపై నిందితులు తప్పించుకుని తిరిగే పరిస్థితి ఏపీలో మాత్రం కనిపించబోదని స్పష్టం చేశారు. ఈ చట్టంలో భాగంగా ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంటుందని, త్వరితగతిన శిక్షలు విధించడమే కోర్టుల లక్ష్యమవుతుందని తెలిపారు. మహిళల పట్ల సామాజిక మాధ్యమాల్లో, ఫోన్ కాల్స్ లో అసభ్యంగా మాట్లాడినా కేసులు నమోదవుతాయని సుచరిత పేర్కొన్నారు.

Related posts